Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 Followed
 Rating
 Correct
 Wrong
 Stamp
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  

Ranikhet Express - रेगिस्तान में हरियाली

Full Site Search
  Full Site Search  
 
Fri Oct 30 04:56:21 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Topics
Gallery
News
FAQ
Trips/Spottings
Login
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 419499
Smartphone ముందు భాగంలో మనకు ఎక్కువ ప్రదేశం వాడుకోటానికి కావాలంటే, selfie camera లాంటివి అడ్డుగా వస్తూ ఉంటాయి. దీనికి పరిష్కారంగా గత కొన్ని సంవత్సరాలుగా pop-up selfie cameraలు, ఇతర అనేక రకాల పద్ధతులను స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలు అనుసరిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటన్నిటికి భిన్నంగా, తాజాగా phone screenలో అసలు కెమెరా ఉన్న విషయం కూడా ఏ మాత్రం అనుమానం రాని విధంగా in-display camera టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.

ZTE Axon 20 5G ఫోన్‌లో ఇలా phone screenలోనే అంతర్గతంగా కెమెరాను పొందుపరిచారు. అయితే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అనేక రకాల టెక్నాలజీలను కలిపి వాడటం ద్వారా ఈ in-display camera సాధ్యపడింది. అన్నిటికంటే మొట్టమొదటిది, సరికొత్త సలహా స్క్రీన్ దీంట్లో వాడబడింది. ఆర్గానిక్
...
more...
మరియు మామూలు తరహా ఫిల్మ్‌లను ఉపయోగించి ZTE సంస్థ మరింత పారదర్శకంగా ఉండే మెటీరియల్ తయారు చేసి, దాని సాయంతో స్క్రీన్ రూపొందించింది. ఈ సరికొత్త స్క్రీన్ ద్వారా భారీ మొత్తంలో లైటింగ్ స్క్రీన్ అంతర్భాగంలో పొందుపరచబడి ఉన్న కెమెరాకు చేరుతుంది.

రెండో అంశానికి వస్తే, అంతర్గతంగా కెమెరా పని చేసే విధానం కూడా పూర్తిగా మార్చేశారు. తనకు తాను స్వతస్సిద్ధంగా పనిచేసే కంట్రోల్ చిప్, దాంట్లోనే అంతర్గతంగా డ్రైవర్ సర్క్యూట్స్ నిక్షిప్తం చేశారు. ఇవి బయట నుంచి వచ్చిన కాంతిని సమర్థవంతంగా ప్రాసెసింగ్ చేస్తాయి. అలాగే అదనంగా కల్పించబడిన కంట్రోల్ చిప్, స్క్రీన్ నుండి వచ్చే అవాంచిత వెలుతురు మరియు రంగులను వేరు చేసి, వాటి మూలంగా ఫోటోలో ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా కాపాడుతుంది.

Phone Screenలో కెమెరాని నిక్షిప్తం చేసిన ప్రదేశం, ఏ మాత్రం అనుమానం లేకుండా, ప్రత్యేకంగా కనిపించకుండా, అంతా ఒకే విధంగా కనిపించడం కోసం పిక్సెళ్లని ఆప్టిమైజ్ చేసే ప్రత్యేకమైన మ్యాట్రిక్స్ ఉపయోగించబడింది. అలాగే కెమెరాను ఉపయోగించేటప్పుడు మరింత మెరుగైన పనితీరు లభించడం కోసం ప్రత్యేకమైన ఆల్గారిధమ్ కూడా ఉపయోగించబడింది.

రాబోయే కొద్ది సంవత్సరాల్లో మనం వాడబోతున్న smartphoneలు అన్నీ ఇలాంటి ప్రత్యేకమైన in-display cameraని కలిగి ఉండబోతున్నాయి
Go to Full Mobile site