Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 Followed
 Rating
 Correct
 Wrong
 Stamp
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  

Ammi Jaan kahti thi Railfanning se bada koi dharm nhi hota or koi Railfan chhota nhi hota - Shanzil Kabir

Full Site Search
  Full Site Search  
 
Thu Oct 22 15:04:43 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Topics
Gallery
News
FAQ
Trips/Spottings
Login
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 419566
కేంద్ర ప్రభుత్వం పలు పర్యాయాలు TikTok, PUBGతో సహా అనేక చైనా అప్లికేషన్లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే అవి ఎలాగైనా మళ్లీ మన దేశంలోకి రావటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. నేరుగా ప్రవేశించడం కాకుండా తాజాగా మారు పేర్లతో ప్రవేశించే ప్రయత్నం కూడా అవి చేస్తున్నాయని తెలుస్తోంది.

Snack Video అనే అప్లికేషన్ ఈమధ్య భారతీయ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే ఇది ఇప్పటికే నిషేధించబడిన TikTokని పూర్తిస్థాయిలో పోలి ఉండటం గమనార్హం. మరోవైపు, అపరిచితులతో ఛాట్ రూమ్ క్రియేట్ చేసుకొని, వారితో గేమ్స్ ఆడటానికి వీలు కల్పించే నిషేధించబడిన Hago అప్లికేషన్ మాదిరిగానే Ola Party పేరుతో ఒక అప్లికేషన్ ఇటీవల బాగా పాపులర్ అవుతోంది. నిషేధించబడిన Hago అప్లికేషన్ కి ఈ కొత్త Ola Party యాప్‌కి అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయి అన్న దానికి
...
more...
ప్రధాన రుజువుగా, ఈ కొత్త అప్లికేషన్ Hagoలో గతంలో వినియోగదారులు కలిగిన ప్రొఫైల్ ఉన్నది ఉన్నట్లు ఉపయోగించుకోడానికి అవకాశం కల్పిస్తోంది. అంటే పాత డేటాబేస్‌ని ఈ కొత్త అప్లికేషన్ తో వాడుతున్నారు అన్నమాట.

ఇదిలా ఉంటే ఈ విషయంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రతినిధులు స్పందిస్తూ.. “ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ నిజంగానే ఇలా పేర్లు మార్చుకుని నిషేధించబడిన అప్లికేషన్స్ మళ్లీ ప్రవేశిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం” అంటూ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి కొత్తగా పేర్లు మార్చుకుని మార్కెట్లోకి వస్తున్న అనేక చైనా అప్లికేషన్స్, మున్ముందు భారత ప్రభుత్వం నుండి చర్యలు తప్పించుకోవడం కోసం, కొంత మంది భారతీయ డెవలపర్లతో ఒప్పందాలు కుదుర్చుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

కేవలం అది మాత్రమే కాదు, చైనా నుండి వస్తున్న కొత్త అప్లికేషన్స్ భారత ప్రభుత్వం కళ్లు కప్పటానికి తమ రిజిస్టర్డ్ ఆఫీసులను చైనాలో కాకుండా కొన్ని దక్షిణాసియా దేశాలలో నెలకొల్పినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏదో ఒక పేరుతో మళ్లీ అవి భారత్ ను ముంచెత్తుతాయి.

Go to Full Mobile site