Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 Followed
 Rating
 Correct
 Wrong
 Stamp
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  

ಮೈಸೂರು - ವಾರಣಾಸಿ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್: ಕಾವೇರಿ ಮತ್ತು ಗಂಗಾ ನದಿಗಳ ಸಂಪರ್ಕ ಸೇತುವೆ - Vishwanath Joshi

Full Site Search
  Full Site Search  
 
Thu Oct 22 07:13:16 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Topics
Gallery
News
FAQ
Trips/Spottings
Login
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 419495
Sep 25 (08:58) Breaking: టీవీ9 నుంచి రజనీకాంత్ అవుట్ !! (www.namasteandhra.com)
*people-culture
0 Followers
645 views

News Entry# 419495  Blog Entry# 4724560   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
September 25, 2020

మనకోసం మనం ఏమైనా పోగొట్టుకోవచ్చు. అది ఎక్కువకాలం బాధపెట్టదు.


...
more...

ఇతరుల కోసం డబ్బు పోగొట్టుకున్నా అది అంత బాధపెట్టదు.



కానీ ఇతరుల కోసం మన పరువు తాకట్టుపెట్టినా అది ఫలితం ఇవ్వకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా?



దాని సంగతి ఏమో గాని ఇపుడు టీవీ9 రజనీకాంత్ పరిస్థితి మాత్రం పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

తాజా సమాచారం ప్రకారం... రజనీకాంత్ కు పొమ్మనకుండా పొగపెట్టడంతో ఆయన టీవీ9 నుంచి నిష్క్రమించారట.

రవి ప్రకాష్ నుంచి టీవీ9 చేతులు మారే వరకు అందులో ఉన్నవారంతా రవి ప్రకాష్ క్రియేషన్. రజనీకాంత్ తో సహా టీవీ9 లో తొలి నుంచి ఉన్నవారిని ఎవరినీ కొత్త యాజమాన్యం నమ్మడం లేదట. అయితే వెంటనే తొలగిస్తే ఛానెల్ నడపటం కష్టం కాబట్టి... వారితో ప్రేమగా నటిస్తూ కొత్త టీంని తెచ్చుకుంటూ ఛానెల్ పై పట్టు వచ్చాక పాత బ్యాచ్ ని బయటకు పంపుతున్నారట.

ఈ విషయం తెలియక... సహజమైన తన న్యూట్రల్ జర్నలిజానికి సమాధి కట్టి యాజమాన్యపు ఆంతరంగిక వ్యవహారాలకు అనుగుణంగా, యజమాని సానుకూల పార్టీకి అనుగుణంగా తనను తాను మార్చుకున్నారు రజనీకాంత్. ఈ క్రమంలో ఆయన పై సోషల్ మీడియాలో తీవ్రంగా దూషణల పర్వం సాగింది. బూతులు తిట్టారు. విమర్శించారు. అతన్ని ఎంత అవమానించాలో అంత అవమానించారు. అయినా అవన్నీ పట్టించుకోకుండా... యాజమాన్యంకోసం పనిచేసిన రజనీకాంత్ కృషి బూడిదలో పోసిన పన్నీరైంది. న్యూట్రల్ జర్నలిజం నుంచి పార్టీ జర్నలిజానికి మారిపోయిన ఆయన గమ్యం అగమ్యగోచరంగా మారింది.

ఇప్పటికే ఓ సారి టీవీ9 మానేసి ఇతర ఛానెల్ కి వెళ్లి తన తప్పు తెలుసుకుని లెంపలేసుకున్న రజనీకాంత్ జీవితంలో ఇది రెండోసారి వచ్చిన కష్టం. మరి ఇపుడు ఆయన అడుగులు ఎటువైపు. కొత్తగా తాను అలవాటు చేసుకున్న లక్షణంతో సాక్షివైపు అడుగులు వేస్తారా? అక్కడ ఆల్రెడి కొమ్మినేని వంటి పెద్ద ఉన్నారు. టీవీ5, ఏబీఎన్, 10tv, టిన్యూస్ తదితర వాటిలో అవకాశాలు లేవు. రజనీకాంత్ ముందు చాలా తక్కువ చాయిస్ లు ఉన్నాయి. మరి ఆయన గమ్యం ఎటువైపో.

కాలమే నిర్ణయిస్తుంది.
Go to Full Mobile site